News14th Aug 11:06 AMSunil Byrisetty1 min read

విశాఖ, బెంగళూరు మధ్య వందే భారత్

విశాఖపట్నం, బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు కూత పెట్టనుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రైలు త్వరలో ప్రారంభం కానుంది. రైల్వే బోర్డు వందే భారత్ కోసం పచ్చజెండా ఊపింది. దీంతో

విశాఖ, బెంగళూరు మధ్య వందే భారత్
విశాఖపట్నం, బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు కూత పెట్టనుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రైలు త్వరలో ప్రారంభం కానుంది. రైల్వే బోర్డు వందే భారత్ కోసం పచ్చజెండా ఊపింది. దీంతో దక్షిణ తీర రైల్వే జోన్ అధికారులు రైలు కార్యకలాపాల కోసం రూట్ మ్యాప్ సిద్ధమైంది.దీనికి సంబంధించి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డీఆర్ఎంలకు ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి.విశాఖపట్నం- బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు సోమవారాలు మినహా మిగతా అన్ని రోజులూ నడుస్తుంది. రాత్రి 8:15 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరిన ఈ రైలు, రాత్రి 8:45 గంటలకు దువ్వాడకు, అర్ధరాత్రి 1:05 గంటలకు కృష్ణా కెనాల్‌కు, తెల్లవారుజామున 4:40 గంటలకు నంద్యాలకు, ఉదయం 7:30 గంటలకు ధర్మవరానికి చేరుకుని, ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
Andhra Pradesh
Railway Board
Train Services
Visakhapatnam
Bengaluru
Vande Bharat
Vande Bharat Sleeper
Indian Railways
Railway Connectivity
విశాఖ–బెంగళూరు రైలు
దువ్వాడ
విజయవాడ
నంద్యాల
ధర్మవరం
దక్షిణ తీర రైల్వే
Scroll for the next article