Transport22nd Jul 12:21 PMSunil Byrisetty1 min read

దసరాకు 'వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు'

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కూర్చుని ప్రయాణించే వందేభారత్‌ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాత్రి ప్రయాణాలకు అనువుగా స్లీపర్‌ వె

దసరాకు 'వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు'
వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కూర్చుని ప్రయాణించే వందేభారత్‌ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాత్రి ప్రయాణాలకు అనువుగా స్లీపర్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దసరా నాటికి విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌, చెన్నై, విశాఖపట్నం మార్గాల్లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు విజయవంతంగా నడుస్తుండగా, ఇప్పుడు స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రావడం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది. వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నారు. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ బోగీల్లో ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌, ఆధునిక బెర్తులు, ఎల్‌ఈడీ లైటింగ్‌, సౌండ్‌ ప్రూఫ్‌ డిజైన్‌, హైస్పీడ్‌ వైఫై, మొబైల్‌, ల్యాప్‌టాప్‌ల కోసం ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆటోమెటిక్‌ డోర్లు, సీసీటీవీ నిఘా, భద్రతా సెన్సర్లు, ఆధునిక అగ్నిమాపక వ్యవస్థ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Railway news
Vande Bharat Sleeper
Indian Railways
Vijayawada Division
Secunderabad
Chennai
Modern Sleeper
రైల్వే వార్తలు
రాత్రి రైళ్లు
ఆధునిక రైళ్లు
తెలుగు వార్తలు
Scroll for the next article