News30th May 09:19 AMSunil Byrisetty1 min read

విజయవాడ టూ తిరుపతి.. సగానికే!

రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి టెంపుల్ సిటీ తిరుపతికి ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. రయ్..రయ్‌మని దూసుకెళ్లే వందేభారత్ ట్రైన్ వచ్చేస్తుంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజుల

విజయవాడ టూ తిరుపతి.. సగానికే!
రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి టెంపుల్ సిటీ తిరుపతికి ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. రయ్..రయ్‌మని దూసుకెళ్లే వందేభారత్ ట్రైన్ వచ్చేస్తుంది. మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్‌లు కాగా.. విజయవాడ(ఉదయం 5.15) నుంచి తిరుపతి(ఉదయం 9.45)కి కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే ప్రయాణ సమయం ఉండనుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందేభారత్ రైలు వస్తే.. భక్తులు వేగంగా స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు.
Andhra Pradesh news
Vande Bharat train
Prashanti Express
Vijayawada
tirupati
banglore
విజయవాడ టూ తిరుపతి
వందేభారత్ ట్రైన్
Scroll for the next article