News16th Apr 05:26 PMSunil Byrisetty1 min read

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన.. వందేభారత్ పరుగులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. జమ్ము కశ్మీర్లోని వైష్ణోదేవి కట్రా- శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రై

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన.. వందేభారత్ పరుగులు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. జమ్ము కశ్మీర్లోని వైష్ణోదేవి కట్రా- శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. ఈ వంతెనను ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనిపై ఇక వందే భారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు నడిచే వందేభారత్ రైలుతో ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం కట్రా -శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3 గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను, కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.
National
World's Highest Chenab Rail Bridge
Vande Bharat Train
Delhi to Kashmir
వందేభారత్ రైలు
చినాబ్ రైల్వే బ్రిడ్జి
Scroll for the next article