News7th Nov 03:05 PMSunil Byrisetty1 min read
వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో వందేమాతరం గేయం స్ఫూర్తి నింపిందని.. విద్వాంసులు నుంచి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని, వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భార
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో వందేమాతరం గేయం స్ఫూర్తి నింపిందని.. విద్వాంసులు నుంచి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని, వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తదితరులతో కలిసి భరతమాత చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు. వందేమాతరం రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మూడువేల మంది విద్యార్థులతో వందేమాతరం గేయాలాపన చేశారు. ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్‌గా వీక్షించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని.. ఈ సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.