Politics14th Oct 06:19 PMSunil Byrisetty1 min read

పవన్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి

కాపు నేత వంగవీటి రాధా జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన రాధాకు ప్రాధాన్

పవన్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి
కాపు నేత వంగవీటి రాధా జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన రాధాకు ప్రాధాన్యత కల్పిస్తారని భావించారు. అయితే రెండేళ్లు గడిచినా రాధాకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వంగవీటి మోహన్ రంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలోనూ పని చేశారు. ప్రస్తుతం వంగవీటి రాధా జనసేనలో చేరారు. అయితే విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
Scroll for the next article