News14th Oct 06:31 PMSunil Byrisetty1 min read

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తున్న ఎన్సిసి

దేశవ్యాప్తంగా యువతలో దేశభక్తిని ప్రేరేపిస్తూ, దేశం, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేయాలనే ఆలోచనా విధానాన్నీ ఎన్సీసీ పెంపొందిస్తోందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ తెలిపారు.

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తున్న ఎన్సిసి
దేశవ్యాప్తంగా యువతలో దేశభక్తిని ప్రేరేపిస్తూ, దేశం, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేయాలనే ఆలోచనా విధానాన్నీ ఎన్సీసీ పెంపొందిస్తోందని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. దేశ సమగ్రత, జాతీయ ఐక్యత, భిన్న సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన కలిగించేందుకు ఎన్సీసీ నిర్వహిస్తున్న స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు దోహదపడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ NCC డైరెక్టరేట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు గండిగుంటలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్ లో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ను నిర్వహిస్తున్నారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో, క్యాంపు డిప్యూటీ కమాండెంట్ వన్ ఆంధ్ర EME కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ విజయంత్ శ్రీవాత్సవ్, ట్రైనింగ్ ఆఫీసర్ SM లెఫ్టినెంట్ కల్నల్ చందర్ ఠాకూర్ పర్యవేక్షణలో క్యాంపును నిర్వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ క్యాంపును సందర్శించారు. NCC క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దేశభక్తిని ప్రేరేపిస్తూ, దేశం, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేయాలనే ఆలోచనా విధానాన్ని ఎన్సీసీ పెంపొందిస్తోందని తెలిపారు.
Scroll for the next article