Politics27th Oct 02:20 PMSunil Byrisetty1 min read

ఎంపి ర‌మేష్‌తో విజ‌య‌వాడ వంగ‌వీటి భేటీ

జ‌న‌సేన రాజ్య‌స‌భ ఎంపి లింగ‌మ‌నేని ర‌మేష్ తో విజ‌య‌వాడ మేయ‌ర్ కూట‌మి అభ్య‌ర్థి వంగ‌వీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన పార్టీ విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప‌రిశీల‌

ఎంపి ర‌మేష్‌తో విజ‌య‌వాడ వంగ‌వీటి భేటీ
జ‌న‌సేన రాజ్య‌స‌భ ఎంపి లింగ‌మ‌నేని ర‌మేష్ తో విజ‌య‌వాడ మేయ‌ర్ కూట‌మి అభ్య‌ర్థి వంగ‌వీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన పార్టీ విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు, రాజ్య‌స‌భ ఎంపి లింగ‌మ‌నేని ర‌మేష్‌ ని ఆయన నివాసంలో కూట‌మి మేయ‌ర్ అభ్య‌ర్థి వంగ‌వీటి రాధా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల గురించి చ‌ర్చించారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు, ప్ర‌చార ప్ర‌ణాళిక‌లపై చ‌ర్చించారు. కూట‌మి పార్టీల నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని లింగ‌మ‌నేని ర‌మేష్ సూచించారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కునిగా ఎంపి లింగ‌మ‌నేని ర‌మేష్ ని జ‌న‌సేన పార్టీ నియ‌మించింది.
Scroll for the next article