News14th Oct 01:22 PMSunil Byrisetty1 min read
జనసేనలోకి వంగవీటి రాధా
వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీతో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో జనసైనికుల సందడి నెలకొంది. నగరమంతా ఫ్లె
వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీతో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో జనసైనికుల సందడి నెలకొంది. నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయవాడలో అన్ని వర్గాలలో పట్టు ఉన్న నేత వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయిన రాధా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జన సైనికులు, కుటమి నాయకులు వంగవీటి రాధాకి అభినందనలు తెలియజేశారు. వంగవీటి రాకతో విజయవాడ నగర జనసేన పార్టీ మరింత బలపడనుంది. రాధా రాకతో రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మరింత బలోపేతం అవుతుందని నాయకులు చెబుతున్నారు. రాధా రాకతో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు.