Politics27th Dec 03:09 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లోకి రంగా వారసులు!
వంగవీటి కుటుంబం యాక్టివ్ అవుతోంది. రంగా బంధువులు అంతా తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు అవకాశమున్న పార్టీల్లో లేదా ప్రత్యేక వేదికలు పెట్టి తమ రాజకీయ భవిష్యత్‌ను రంగా జయంతి, వర్థంతి
వంగవీటి కుటుంబం యాక్టివ్ అవుతోంది. రంగా బంధువులు అంతా తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు అవకాశమున్న పార్టీల్లో లేదా ప్రత్యేక వేదికలు పెట్టి తమ రాజకీయ భవిష్యత్‌ను రంగా జయంతి, వర్థంతి సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. వంగవీటి రంగా కుమారుడు రాధా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో ఆయనకు త్వరలో ముఖ్య పదవి లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ తెరపైకి వచ్చారు. వంగవీటి రంగాకు కుమార్తె ఉన్నారనే చాలా మందికి తెలియదు. హఠాత్తుగా ఆమె తెరపైకి వచ్చి రాధా, రంగా మిత్రమండలిని యాక్టివేట్ చేసుకున్నారు. ఆమెను వైసీపీ తెరపైకి తెచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.