Politics16th Nov 11:51 AMSunil Byrisetty1 min read

రాజకీయాల్లోకి రంగా కుమార్తె!

వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు. విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె ప్రకటించారు. రాధా రంగా మిత్రా మండలి ఆహ్వాన

రాజకీయాల్లోకి రంగా కుమార్తె!
వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు. విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె ప్రకటించారు. రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నానని, ఇకపై కంప్లీట్ గా పబ్లిక్లో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని, రాధా రంగా మిత్రా మండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి వస్తున్నానని వెల్లడించారు. కులం,మతం బేధం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి రంగా అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆశ కిరణ్ పేర్కొన్నారు.
Andhra Pradesh News
Vangaveeti Ranga
Asha Kiran
Political Entry
Vijayawada Politics
Ranga Mitra Mandali
Public Life
రాజకీయ ప్రవేశం
వంగవీటి కుటుంబం
రంగా ఆశయాలు
Scroll for the next article