Spiritual8th Aug 08:49 AMSunil Byrisetty1 min read
వరలక్ష్మీ వ్రతం.. మహిళలకు ఎంతో విశిష్టం!
వివాహమైన మహిళలు విశిష్టంగా చేసే వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతం పెళ్ళైన వారికే కాదు.. వివాహం కాని యువతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీర్వాదం
వివాహమైన మహిళలు విశిష్టంగా చేసే వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతం పెళ్ళైన వారికే కాదు.. వివాహం కాని యువతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి భక్తి, శ్రద్ధ ఉంటే సరిపోతుంది. సంపద, సంతోషం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల ప్రకారం.. శివుడు ఈ వ్రతం గురించి పార్వతీ దేవికి చెప్పారని.. పార్వతీ దేవి తన కుటుంబం క్షేమం కోసం ఈ పూజ చేసిందని చెబుతారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం జరుపుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రుల ఇంటికి మంచి జరగాలని.. అలాగే మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ వ్రతం చేయవచ్చు. ఈ పూజలో పురుషులు కూడా పాల్గొనవచ్చు. కానీ ముఖ్యంగా మహిళలు చేస్తారు. పూజ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడి గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ప్రతిమను అందంగా అలంకరించి కలశం పెడతారు. పూలతో దేవిని పూజించి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పూజ పూర్తయ్యాక ముత్తయిదువులకు తాంబూలం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శుభ వాతావరణం నెలకొంటుంది.
ఈ వ్రతంలో అమ్మవారికి ఇష్టమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు. చక్కెర పొంగలి, పాయసం, కొబ్బరి లడ్డు వంటివి సమర్పిస్తారు. ఈ వంటకాలను ప్రేమతో, భక్తితో ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.