Entertainment1st Oct 04:53 PMSunil Byrisetty1 min read
‘ఆర్ఆర్ఆర్’ను మించి వారణాసి అంచనా
రాజమౌళి సినిమా అంటే చాలు.. బిజినెస్ పరంగా రికార్డులు దద్దరిల్లుతాయి. మరీ రిస్కేమో అనే అనుమానం కలుగుతుంది. చివరికి చూస్తే ఆయన సినిమాలు అంచనాలను మించిపోయి భారీ వసూళ్లు సాధించి బయ్యర్
రాజమౌళి సినిమా అంటే చాలు.. బిజినెస్ పరంగా రికార్డులు దద్దరిల్లుతాయి. మరీ రిస్కేమో అనే అనుమానం కలుగుతుంది. చివరికి చూస్తే ఆయన సినిమాలు అంచనాలను మించిపోయి భారీ వసూళ్లు సాధించి బయ్యర్లకు లాభాలు అందిస్తాయి. జక్కన్న చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.225 కోట్లు పెట్టి కొంటే.. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.265 కోట్ల మేర షేర్ రాబట్టింది. పెద్ద స్టార్లు డైరెక్టర్ల కొత్త సినిమాలకు వారి పాత సినిమాల ఫైనల్ షేర్‌ను ప్రామాణికంగా తీసుకుని బిజినెస్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ‘వారణాసి’కి కూడా అదే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏరియాల వారీగా ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ షేర్ ఆధారంగా.. ఈ సినిమాకు అమ్మకాలు మొదలయ్యాయట. ఆ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.275 కోట్ల మేర బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఈ నంబర్ అంటే.. ఇక మిగతా ఇండియన్ స్టేట్స్, వరల్డ్ వైడ్ బిజినెస్ నెక్స్ట్ లెవల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.