News19th Aug 02:37 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన వర్ల రామయ్య
శాసనమండలి సభ్యుడిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాధ్యతలు స్వీకరించారు. రామయ్యకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన టీడీపీ సీని
శాసనమండలి సభ్యుడిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాధ్యతలు స్వీకరించారు. రామయ్యకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం మంత్రి నారా లోకేష్ ను అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల మంత్రి లోకేష్ కు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలు, వాయిస్ మండలిలో మరింత బలంగా వినపడేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు. అనంతరం శాసనమండలి వాయిదా పడింది.