Politics20th Mar 09:52 AMSunil Byrisetty1 min read
రామానాయుడు భూములు వెనక్కి?
ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విశాఖలో రామానాయుడు స్టూడియోకి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే భూముల సద్వినియోగం దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో
ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విశాఖలో రామానాయుడు స్టూడియోకి ప్రభుత్వం భూములు కేటాయించింది.
అయితే భూముల సద్వినియోగం దిశగా ఎలాంటి అడుగులు పడలేదు.
దీంతో రూ. వందల కోట్ల విలువైన ఆ భూములను వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.
సినీ పరిశ్రమ కోసం విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
‘ఈ స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల భూమి కేటాయించారు.
అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారు.
దీనిపై నేను సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆపాను. ఇన్నేళ్లలో ఆ భూమిని స్టూడియో కోసం వాడలేదు.
ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’ అని ఎమ్మెల్యే కోరారు