News31st Aug 11:06 AMSunil Byrisetty1 min read
కరవు నేలకు వరప్రదాయిని వెలిగొండ!
దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలు జలకళ సంతరించుకోనున్నాయి. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో వెలిగొండ ప్రాజెక్టు కొ
దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలు జలకళ సంతరించుకోనున్నాయి. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో వెలిగొండ ప్రాజెక్టు కొత్త వెలుగులు నింపబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు.రాష్ట్ర సాగునీటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టంగా మిగలనుంది. శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి మొత్తం 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును రూపొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. వెలిగొండ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు.. తరతరాలుగా కరువుతో పోరాడుతున్న రైతుకు భరోసాగా మారనుంది.