News26th Aug 02:55 PMSunil Byrisetty1 min read
31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభం
ఈ నెల 31న మూడు దశాబ్దాల వెలిగొండ కల సాకారం కాబోతోందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 31న ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్
ఈ నెల 31న మూడు దశాబ్దాల వెలిగొండ కల సాకారం కాబోతోందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 31న ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఫీడర్ కెనాల్ లో ముఖ్యమంత్రి ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను పరిశీలించారు. వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చే, ఘాట్, స్థూపం, సభా స్థలం ఏర్పాట్ల పై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు.నిర్వాసితుల కాలనీలను సందర్శించి, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ కు, అధికారులకు పలు సూచనలు చేశారు. వెలిగొండ ప్రారంభోత్సవ వేళ చంద్రబాబుకి, నిర్వాసితులకు ఇక్కడి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. వెలుగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ, పేరు పేరునా పాదాభివందనాలు చేస్తున్నామన్నారు. 7వేల నిర్వాసితుల కుటుంబాల త్యాగఫలితమే నేడు, లక్షలాది ఎకరాలకు సాగు, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందబోతుందన్నారు.