Politics8th Sep 11:54 AMSunil Byrisetty1 min read
డీఎస్సీపై ఆగని కుట్రలు
వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఖండించారు. ఎప్పుడూ అసత్య ప్రచారాలు చేయడమే అలవాటుగా మార్చుకున్న వైసీపీకి నిరుద్యోగుల భవిష్యత్తుపై మాట్లాడే అర్
వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఖండించారు. ఎప్పుడూ అసత్య ప్రచారాలు చేయడమే అలవాటుగా మార్చుకున్న వైసీపీకి నిరుద్యోగుల భవిష్యత్తుపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు, ఒక్క పరిశ్రమా తీసుకురాలేదు, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత పడ్డ అవస్థలు, గోస ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎంతో పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ అసత్య ప్రచారాలకు ఒడిగడుతోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నా, ఉపాధ్యాయుల గౌరవం నిలబడాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే వైసీపీ అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మరని ఆమె స్పష్టం చేశారు.