Politics12th Apr 01:58 PMSunil Byrisetty1 min read

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. వెంకయ్యనాయుడు సంచలనం

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలను ప్రజలు ఇంటిక

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. వెంకయ్యనాయుడు సంచలనం
రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలను ప్రజలు ఇంటికి పంపారంటూ వ్యాఖ్యానించారు. దౌర్జన్యాలు, బెదిరింపులు పాల్పడినవారు ఘోరంగా ఓడిపోయారన్నారు. ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్‌లోనే ప్రజలు సమాధానం చెప్పారని గుర్తు చేశారు. తుపాకీతో భయపెట్టాలని చూసినవారు ఆ తుపాకికే బలయ్యారన్నారు. ఎన్నికలంటే ప్రజల్లోనూ మార్పు రావాలని, ఉచితమని ప్రకటన చేసే ప్రతి పార్టీని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో డబ్బు, కులం, ప్రాంతాలకే ప్రాధాన్యత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో అవేమీ ఉండకూడదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్తే.. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని ఆకాంక్షించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమగ్రంగా మార్చాలన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నికకు సిఫార్సు చేస్తుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే రూ.12 వేల కోట్లు ఆదా అవుతాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు
Venkaiah naidu
jamili elections
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Scroll for the next article