TTD13th Nov 12:24 PMSunil Byrisetty1 min read
గత ఐదేళ్లు టీటీడీలో అన్నీ అక్రమాలేనా!
తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో గత ప్రభుత్వంలో ఐదేళ్లలో అన్నీ అక్రమాలే జరిగాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. లడ్డూ తయారీలో నెయ్యి నుంచి హుండీ, ఇతర అన్ని వ్యవహారాలనూ కల్తీ చేసినట్
తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో గత ప్రభుత్వంలో ఐదేళ్లలో అన్నీ అక్రమాలే జరిగాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. లడ్డూ తయారీలో నెయ్యి నుంచి హుండీ, ఇతర అన్ని వ్యవహారాలనూ కల్తీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లడ్డూ తయారీకి సరఫరా చేస్తోంది నెయ్యికాదని తెలిసినా.. టెండర్ల నిబంధనలు మార్చి భోలేబాబాకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఎప్పుడైనా దొరికిపోతామని చెప్పి.. అప్పుడప్పుడు ట్యాంకర్లలో క్వాలిటీ లేదని చెప్పి.. కొన్ని తిరస్కరించి మళ్లీ వాటిని వేరే కంపెనీల పేర్లతో తీసుకున్నారు. ఆయా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారని కూటమి ప్రభుత్వ విచారణలో వెలుగులోకి వచ్చింది. మరో వైపు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి పరకామణిలో ఏళ్లతరబడి పని చేస్తూ విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్తున్నాడు. ఎలా ఎత్తుకెళ్తూ ఓ సారి దొరికాడు. దొరికినప్పుడు ఏం చేయాలి? భక్తుల సొమ్ము ఎంత మేరు దోచుకెళ్లాడో మొత్తం స్వాధీనం చేసుకుని కేసులు పెట్టాలి. కానీ ఆ దొంగను పట్టుకుని కొంత టీటీడీకి రాయించి మిగతా ఆస్తులన్నీ తాము రాయించుకుని రాజీ చేసి వదిలేశారు. అంటే శ్రీవారి కానుకల్ని దొంగతనం చేసిన వారిని ఈ దొంగలు దోపిడీ చేసి వదిలి పెట్టారు. అంటే వీళ్లు దొంగలకే దొంగలని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు.