Movies13th Jul 09:46 AMSunil Byrisetty1 min read

ప్రముఖ నటుడు కోట ఇక లేరు!

ప్రముఖ సినీ నటుడు, మాక్ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో కోట శ్రీనివాసరావ

ప్రముఖ నటుడు కోట ఇక లేరు!
ప్రముఖ సినీ నటుడు, మాక్ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం చేశారు. ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట.. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు.. 1999లో విజయవాడ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం, అలాగే కెరీర్లో 9 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు వయోభారంతో తుదిశ్వాస విడిచారు.
Tollywood
senior actor
Kota Srinivasa Rao Passed Away
మాక్ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు కన్నుమూశారు
Scroll for the next article