Entertainment21st Aug 04:20 PMSunil Byrisetty1 min read
ఆనాటి నటి జానకి కన్నుమూత
అలనాటి నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో మరణించారు. ప్రముఖ నటి కృష్ణకుమారి సోదరే ఈ జానకి. రాజమహేంద్రవరం
అలనాటి నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో మరణించారు.
ప్రముఖ నటి కృష్ణకుమారి సోదరే ఈ జానకి. రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె బాల్యంలో నాటకాలతో కెరీర్ ప్రారంభించారు. 1949లో ‘రక్షా రేఖ' సినిమాతో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1950లో 'షావుకారు' సినిమా హిట్ కావడంతో ఆమెకు షాపుకారు జానకిగా పేరు వచ్చింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో జానకి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో, 3 హిందీ సినిమాల్లోనూ, ఒక మలయాళ చిత్రంలో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. జానకి మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, నటుడు జూ. ఎన్టీఆర్, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.