Entertainment4th Oct 11:45 AMSunil Byrisetty1 min read
సినీ పరిశ్రమలో విషాదం.. కన్నుమూసిన సింగీతం!
సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని తెలుగు ర
సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, శ్రీ రేవంత్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని మంత్రులు, పరిశ్రమ పెద్దలు స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.