Entertainment14th Nov 04:57 PMSunil Byrisetty1 min read

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

సీనియర్ సినీనటుడు గిరిబాబు(80) కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుత

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ సినీనటుడు గిరిబాబు(80) కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు జన్మించారు. సుమారు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా రాణించారు. ‘సింహ గర్జన', ‘మెరుపుదాడి', 'ఇంద్రజీత్', తదితర చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
Scroll for the next article