News2nd Sep 09:14 AMSunil Byrisetty1 min read

పవన్ కల్యాణ్ తో వి.హెచ్.పి. నేతల భేటీ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట

పవన్ కల్యాణ్ తో వి.హెచ్.పి. నేతల భేటీ
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ యేడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి వి.హెచ్.పి. నేతలు వివరించారు. ఈ సమావేశంలో వి.హెచ్.పి. అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏపీ, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి టి.సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి వి.దుర్గా ప్రసాదరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వారు చర్చించారు.
Andhra Pradesh politics
Pawan Kalyan
VHP
Milind Parande
Gokaraju Gangaraju
T. Satya Ravikumar
Obilishetty Srivenkateswarlu
V. Durga Prasada Raju
దేవాలయాల నిర్వహణ
హిందూ సంస్థలు
Scroll for the next article