News22nd Apr 05:39 PMSunil Byrisetty1 min read

సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే.. పార్లమెంట్‌ను మూసివేయాలి

ఉప రాష్ట్రపతి, రాజ్యసభఛైర్మన్ జగదీప్ ధనఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా రాజ

సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే.. పార్లమెంట్‌ను మూసివేయాలి
ఉప రాష్ట్రపతి, రాజ్యసభఛైర్మన్ జగదీప్ ధనఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే 'అల్టిమేట్‌ మాస్టర్స్‌' అని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. "'రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు'' అని అన్నారు.
Jagdeep Dhankhar
Supreme Court
Judicial
Parliament Vs Judiciary
Waqf Amendment Bill
BJP Statement
రాజ్యసభఛైర్మన్ జగదీప్ ధనఖడ్
పార్లమెంట్‌
Scroll for the next article