News4th Aug 05:09 PMSunil Byrisetty1 min read
ఉపరాష్ట్రపతికి 'అమరావతి' పుస్తకం
రాజధాని అమరావతిపై రూపొందించిన పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు అందజేశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహచర టీడీపీ పార్లమెంటు సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతిని మ
రాజధాని అమరావతిపై రూపొందించిన పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు అందజేశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహచర టీడీపీ పార్లమెంటు సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా "Amaravati: Built by the People, Secured by Destiny" పేరుతో రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాల వారసత్వం నుంచి, రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు, మహిళలు 1,631 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాట విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక పరిణామాలు ఈ పుస్తకంలో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.