Politics1st Aug 02:44 PMSunil Byrisetty1 min read

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్ర‌క్రియ షురూ!

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఇటీవ‌ల జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ పదవి భర్తీపై దృష్టి సారించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్ర‌క్రియ షురూ!
ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఇటీవ‌ల జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ పదవి భర్తీపై దృష్టి సారించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్ర‌క‌టించింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరంతా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అయితే ఎన్డీయే, కాంగ్రెస్ పక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
India Politics
Vice President Election
Election Commission
Jagdeep Dhankhar
NDA
Congress
Electoral College
Lok Sabha
Rajya Sabha
2025 Elections
Indian Constitution
Scroll for the next article