News31st Oct 12:07 PMSunil Byrisetty1 min read

సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉపరాష్ట్రపతి సంచలనం

ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ భావిస్తున్నట్లుగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తాను

సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉపరాష్ట్రపతి సంచలనం
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ భావిస్తున్నట్లుగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అయితే, తన నమ్మకాన్ని బలపరిచేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నేతాజీకి అత్యంత నమ్మకమైన అనుచరుడైన పసుపొన్ ముత్తురామలింగ దేవర్ చెప్పిన మాటల వల్లే తాను ఈ విషయాన్ని నమ్ముతున్నట్లు వివరించారు. “నేతాజీ ఆ విమాన ప్రమాదంలో మరణించలేదు, నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ నాతో చెప్పారు. అందుకే నేను నమ్ముతున్నాను” అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
India News
Subhas Chandra Bose
Netaji
Vice President
CP Radhakrishnan
Azad Hind Fauj
Indian History
Mystery
Freedom Fighter
విమాన ప్రమాదం వివాదం
పసుపొన్ ముత్తురామలింగ దేవర్
నేతాజీ రహస్య జీవితం
Scroll for the next article