News23rd Oct 10:41 AMSunil Byrisetty1 min read

ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించండి

విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్

ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించండి
విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 1053 కి.మీ.ల సువిశాల తీరం ఉందని, విక్టోరియా పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలో తీరప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ కోరారు.
Andhra Pradesh
Nara Lokesh
Victoria
Melbourne
Heritage Tourism
Eco Tourism
Environmental Branding
Tourism Development
Papikondalu
Visakhapatnam Beach
సుస్థిర పర్యాటకం
అంతర్జాతీయ భాగస్వామ్యం
ఫిలిప్ బే ప్రాజెక్టు
Scroll for the next article