Politics28th Mar 08:43 AMSunil Byrisetty1 min read
మాజీ మంత్రి విడదల రజిని అరెస్ట్? షాకిచ్చిన హైకోర్టు
మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పిల్లి కోటిని ఐదు రోజులు లాకప్‌లో పడేసి తీవ్రంగా కొట్టించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రజిని ముందస్తు బెయిల్ పిటిషన్
మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పిల్లి కోటిని ఐదు రోజులు లాకప్‌లో పడేసి తీవ్రంగా కొట్టించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్‌ను గౌరవ హైకోర్టు తిరస్కరించింది.
ఇక రజిని అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లేనని సమాచారం.
మరోవైపు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఏపీ ఏసీబీని ఆదేశించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడదల రజిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.