National10th Jul 03:34 PMSunil Byrisetty1 min read
పోలీసుల డ్రామా వల్లే తొక్కిసలాట.. సీఎం సంచలనం
తమిళనాడు ఎన్నికల ముందు టీవీకే ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కరూర్ లో టీవీకే అధినేత విజయ్ సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల తర్వాత
తమిళనాడు ఎన్నికల ముందు టీవీకే ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కరూర్ లో టీవీకే అధినేత విజయ్ సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల తర్వాత గెలిచి CM అయిన టీవీకే చీఫ్ విజయ్ కరూర్ పట్టణంలో పర్యటించారు. ఎన్నికల సమయంలో తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాల్లోని 32 మందికి ప్రభుత్వోద్యోగ నియామకపత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆ ఘటన నన్నెంతో ఆవేదనకు గురిచేసింది. నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన ఘటన అది. పోలీసులు ఆరోజు డ్రామా ఆడారు. ఆ సమయంలో వారిపై తీవ్ర ఒత్తిడి ఉంది’ అని అన్నారు. తొక్కిసలాట జరుగుతుందని చెప్పుంటే సభను వాయిదా వేసేవాడినని విజయ్ చెప్పారు.