Politics12th Mar 03:56 PMSunil Byrisetty1 min read

కోటరీ వల్లే జగన్‌కు దూరమయ్యా.. విజయసాయి సంచలనం

కోటరీ వల్లే జగన్‌కు దూరమయ్యానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పేరు పొందిన విజయసా

కోటరీ వల్లే జగన్‌కు దూరమయ్యా.. విజయసాయి సంచలనం
కోటరీ వల్లే జగన్‌కు దూరమయ్యానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పేరు పొందిన విజయసాయి ఇటీవల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానంటూ షాకిచ్చారు. జగన్ కేసుల్లోనూ ఏ2గా ఉన్న సాయి రెడ్డి నమ్మినబంటుగా వ్యవహరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఆడిటర్‌గా కొనసాగిన విజయసాయి తర్వాత జగన్‌కు ఆత్మీయుడిగా, ఢిల్లీ వ్యవహారాలు చూసే నేతగా ఎదిగారు. ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన సాయి రెడ్డి తాజాగా ఒక కేసులో విజయవాడ వచ్చి మాట్లాడారు. ‘ ‘మీ మనస్సులో నాకు స్థానం లేదని అందుకే పార్టీని వీడుతున్నానని జగన్‌కి చెప్పాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినొద్దని జగన్ కు చెప్పా, నా మనస్సు విరిగిపోయింది కాబట్టి పార్టీ నుంచి బయటికి వచ్చానం’’టూ కీలక వ్యాఖ్యలు చేశారు. విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు నేను వైసీపీలో చేరను, జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారు కానీ మళ్ళీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదని కుండ బద్దలు కొట్టారు. ప్రలోభాలకు లొంగిపోయానని మా నాయకుడు అన్నారు కానీ లొంగలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
Jagan
YSRCP
Vijaya sai Reddy
Breaking News
జగన్
వైస్సార్సీపీ
విజయసాయి రెడ్డి
బ్రేకింగ్ న్యూస్
Scroll for the next article