Politics29th Aug 04:23 PMSunil Byrisetty1 min read
వైసీపీపై విజయసాయి బాంబు.. నేరుగా టార్గెట్ సజ్జల!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా వ్యవహరించి, అనూహ్యంగా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకెళ్లిన విజయసాయి రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. సొంత పార్టీ పెడుతున్నానంటూ ఇటీవల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా వ్యవహరించి, అనూహ్యంగా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకెళ్లిన విజయసాయి రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. సొంత పార్టీ పెడుతున్నానంటూ ఇటీవల ప్రకటించిన ఆయన సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నామమాత్రపు అధినేతగా మిగిలిపోయారని, పార్టీలో అసలైన నెంబర్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డేనంటూ లేఖలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రమే కావని, వైసీపీలో నడుస్తున్న పచ్చి నిజమని పార్టీ అంతర్గత వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తుండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. వైసీపీలో ఏ చిన్న పరిణామం జరగాలన్నా సజ్జల ఆమోదముద్ర తప్పనిసరిగా మారిందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు అయినా, తాడేపల్లి కేంద్ర కార్యాలయం అయినా సరే అడుగుపెట్టాలంటే సజ్జల అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు. విజయసాయి తాజా లేఖతో కలకలం రేపింది.