National28th Sep 11:11 AMSunil Byrisetty1 min read

విజయ్ అరెస్టుపై తమిళనాడు సీఎం

తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. కరూర్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది పైగా తీవ్రంగా గా

విజయ్ అరెస్టుపై తమిళనాడు సీఎం
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. కరూర్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల నేతలు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టాలిన్ హుటాహుటిన కరూర్ చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. స్టాలిన్ మాట్లాడుతూ... "ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. విజయ్‌ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు ఇప్పుడే చెప్పలేనన్నారు.
Tamil Nadu
Vijay
TVK
Karur Stampede
MK Stalin
Public Meeting
Casualties
Injuries
Political Leaders
Narendra Modi
Arrest Speculation
Inquiry Committee
తొక్కిసలాట ఘటన
38 మంది మృతి
గాయపడిన వారు
Scroll for the next article