News22nd Sep 04:43 PMSunil Byrisetty1 min read
ఒకవైపు పదవీ స్వీకారం.. మరోవైపు నిరసనలు
వినాయక చవితి పండగ రోజు నుంచే(సెప్టెంబర్ 14వ తేదీ) పెంచిన విజయ పాల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్టు వద్ద నేడు ఆందోళన నిర్వహిం
వినాయక చవితి పండగ రోజు నుంచే(సెప్టెంబర్ 14వ తేదీ) పెంచిన విజయ పాల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్టు వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. నూతన చైర్మన్ గా దాసరి బాలవర్ధన రావు పదవి స్వీకారం చేస్తున్న తరుణంలో ప్రజల గోడును తెలుపుతూ, సిపిఎం నేడు ధర్నా నిర్వహించింది. గత పది రోజుల నుండి సిపిఎం, ఇతర అనేక ప్రజాసంఘాలు నగరంలోను, జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో పెరిగిన పాల ధరలపై ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినా పాలకమండలి, అధికారులు, ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నుండి స్పందన కరువు అవటంతో సిపిఎం ఆందోళన ఉదృతం చేసింది. తొలుత ప్రధాన గేటు వద్ద సిపిఎం కార్యకర్తలు, మహిళలు ...బ్యానర్లు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన సాగించారు, నిరసన తెలిపారు. చైర్మన్ కు వినతిపత్రం సమర్పించడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అనుమతి ఇవ్వకుండా, అడ్డుకోవటంతో కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది నిరసనకారులపై దురుసుగా ప్రవర్తించారు, దీనితో తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది.