Politics30th Sep 01:06 PMSunil Byrisetty1 min read

మద్యం కేసులో నా ప్రమేయం లేదు

మద్యం కుంభకోణం కేసులో తన ప్రమేయం లేదని,-లిక్కర్ విషయంలో కర్త, కర్మ, క్రియ రాజ్‍ కేసిరెడ్డే అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. మద్యం కేసులో తనకు తెలిసినదంతా అధికారులకు చె

మద్యం కేసులో నా ప్రమేయం లేదు
మద్యం కుంభకోణం కేసులో తన ప్రమేయం లేదని,-లిక్కర్ విషయంలో కర్త, కర్మ, క్రియ రాజ్‍ కేసిరెడ్డే అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. మద్యం కేసులో తనకు తెలిసినదంతా అధికారులకు చెప్పానన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీకి నష్టమని మరోసారి వ్యాఖ్యానించారు. జగన్ వద్ద తనను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి సజ్జలేనన్నారు. త్వరలో పార్టీని ప్రకటిస్తానని.. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పి.. వైసీపీ మాట మార్చిందన్నారు. నాడు విశాఖ రాజధాని అని.. ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేస్తానని మాట తప్పిన వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Scroll for the next article