Education5th Apr 01:31 PMSunil Byrisetty1 min read

విలేకరులకు ఆంక్షలు.. ప్రిన్సిపల్ మేరీ నిర్వాకం

మాచర్లలో బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మంజుల అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయపురి సౌత్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు ప్రెస్ మీట్ కోసం కొందరు విలేకరులు వెళ్లారు. అ

విలేకరులకు ఆంక్షలు.. ప్రిన్సిపల్ మేరీ నిర్వాకం
మాచర్లలో బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మంజుల అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయపురి సౌత్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు ప్రెస్ మీట్ కోసం కొందరు విలేకరులు వెళ్లారు. అయితే విలేకరులకు నో ఎంట్రీ అంటూ ప్రిన్సిపల్ మంజుల అడ్డుకున్నారు. పాఠశాల విద్య జిల్లా నోడల్ అధికారి ఎం. గీత, జీసీడీవో రేవతి గురుకుల పాఠశాల సందర్శనకు వచ్చారని విలేకరులు రాగా గేటు వద్దనే అడ్డుకోవాలని సెక్యూరిటీకి ప్రిన్సిపల్ చెప్పారు. ప్రిన్సిపల్ మేరీ మంజుల పీఎంశ్రీ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఇటీవల పలు కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై విచారణకే అధికారులు వచ్చినట్లు సమాచారం. అయితే విలేకరులను అడ్డుకోవడంతో నిధుల దుర్వినియోగం వాస్తవమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విలేకరులపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రిన్సిపల్ ఎప్పుడూ ఈ విధంగా చేయలేదు. దీంతో మంజుల ఎందుకలా అడ్డుకున్నారో ఉన్నతాధికారులు నిగ్గు తేల్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Macherla
Andhra Pradesh
South BR Ambedkar Gurukul School
Vijayapuri
Scroll for the next article