Politics24th Nov 12:04 PMSunil Byrisetty1 min read

జగన్‌కు సలహా ఇచ్చిన విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేద’ని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణ

జగన్‌కు సలహా ఇచ్చిన విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేద’ని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ చీఫ్ జగన్ గురించి మాట్లాడారు. జగన్‌కు ఓ సూచన చేశారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్న విజయసాయిరెడ్డి.. నిబద్దత లేని వారి మాటలు వినొద్దని జగన్ కు సూచించారు. తనపై చాలా సెటైర్లు వేస్తున్నారన్న విజయసాయిరెడ్డి.. ఎవరెన్ని అనుకున్నా నేను ప్రస్తుతం రైతును మాత్రమే అని తేల్చి చెప్పారు. ‘నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదు. విపరీతమైన ఒత్తిడి వచ్చినా నేను ఎవరికీ లొంగలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తోంది. అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నిబద్దత లేని వారి మాటలు వినొద్దని జగన్ కు నా సూచన. నాకు ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదు. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో 20 ఏళ్ల స్నేహం ఉంది. ఆయనను ఒక్క మాట కూడా అనలేదు” అని విజయసాయి హాట్ కామెంట్స్ చేశారు.
Andhra Pradesh News
Vijayasai Reddy
Jagan
YS Jagan Mohan Reddy
AP Politics
Political Comments
YCP
Pawan Kalyan
రాజకీయ వ్యాఖ్యలు
విజయసాయి కామెంట్స్
Scroll for the next article