Politics2nd Apr 05:30 PMSunil Byrisetty1 min read

బీజేపీలోకి విజయసాయి.. రాజ్యసభ ఖాయం?!

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. బీజేపీలో చేరడానికి ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంద

బీజేపీలోకి విజయసాయి.. రాజ్యసభ ఖాయం?!
వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. బీజేపీలో చేరడానికి ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జనవరి 25న విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసాక పార్టీ నాయకుల పైన విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీలో చేరి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఈనెల 4న ముగుస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే ఉత్తరాంధ్రలో వైసీపీలో ఉన్న కీలక నాయకులు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయి అని బీజేపీ భావిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి సామాజిక వర్గాన్ని చెందిన కీలక నాయకులకు వల వేయడానికి విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరిస్తారు అని బీజేపీ అంచనా వేస్తుంది.
Vijayasai reddy
BJP
AP Politics
Andhra Pradesh
పార్లమెంట్
Scroll for the next article