Crime19th Apr 09:08 AMSunil Byrisetty1 min read

వంద కోట్లు ఇప్పించా.. రాజ్యసభ రేసులో లేను!

మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. స్కాములో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదన్నారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్న

వంద కోట్లు ఇప్పించా.. రాజ్యసభ రేసులో లేను!
మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. స్కాములో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదన్నారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరన్నారు. రాజ్ కసిరెడ్డికి అరబిందో దగ్గర రూ.వంద కోట్లు అప్పుగా ఇప్పించానని, 12 శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పు ఇప్పించానని చెప్పారు. వైసీపీ అధికారంలో లేని సమయంలో అన్నీ తానే చూసుకున్నానని, అధికారంలోకి వచ్చాక తనను వెన్నుపోటు దారుడనని జగన్‌కు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయానని, వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించానని పేర్కొన్నారు. రాజ్యసభ పోటీలో లేనని, ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
YSRCP
Vijayasai Reddy
SIT investigation
మద్యం కుంభకోణం
సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Scroll for the next article