Politics5th Sep 03:22 PMSunil Byrisetty1 min read
రాజకీయ భవిష్యత్తుపై విజయసాయి ప్రకటన
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు 'ఎక్స్'లో విజయసాయ
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు 'ఎక్స్'లో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఇప్పటికే ఏ పార్టీలో చేరబోనని, సొంత పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 7వ తేదీ మధ్యాహ్నం 1:15 నిమిషాలకు 'లెమన్ ట్రీ ప్రీమియర్' హోటల్లో ప్రెస్ మీట్ పెడుతున్నానన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో 'భవిష్యత్తు రాజకీయ విధానం' గురించి కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు.