News17th Jun 09:23 AMSunil Byrisetty1 min read
విజయవాడలో 72 అడుగుల మహామట్టి గణపతి
విజయవాడలో అంగరంగ వైభవంగా డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంఖుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగ
విజయవాడలో అంగరంగ వైభవంగా డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంఖుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా వుందని కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. వినాయకచవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షించేందకు మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, డూండీ గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండీ రాకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.