News21st Aug 04:42 PMSunil Byrisetty1 min read
రోడ్డు భద్రతలో ఆదర్శంగా విజయవాడ
రోడ్డు భద్రతలో విజయవాడను ఆదర్శంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని.. అదేవిధంగా లక్ష్యాల సాధనకు ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర
రోడ్డు భద్రతలో విజయవాడను ఆదర్శంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని.. అదేవిధంగా లక్ష్యాల సాధనకు ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
విజయవాడను రోడ్డు భద్రతలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
హోండా ఇండియా ఫౌండేషన్ సీఎస్‌ఆర్ భాగస్వామిగా, ట్రాక్స్ – రోడ్ సేఫ్టీ ఎన్‌జీవో అమలు సంస్థగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. రవాణా, పోలీస్ శాఖల సహకారంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు, క్షతగాత్రులను 10–15 శాతం మేర తగ్గించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతన పెంపొందించడం ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టును ప్రధానంగా ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్ అనే నాలుగు అంశాల ఆధారంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బ్లాక్‌స్పాట్‌లలో మౌలిక వసతుల లోపాలను గుర్తించి సరిచేయడం, 105 పాఠశాలలు, 14 కళాశాలల్లో సుమారు 70 వేల మంది విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, హెల్మెట్, సీటుబెల్ట్, లేన్ క్రమశిక్షణ, పాదచారుల భద్రతపై ప్రచారం నిర్వహించడం, ప్రమాదాల సమయంలో ప్రాథమిక సహాయం అందించేందుకు ఫస్ట్ రెస్పాండర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.