News26th Jul 11:20 AMSunil Byrisetty1 min read

మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో

మెట్రో రైల్ ప్రాజెక్టులను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు విశాఖ, విజయవాడ మెట్రో రైల్ పనులను మూడేళ్లలో సిద్ధం చేయనున్నట్లు మున

మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రో
మెట్రో రైల్ ప్రాజెక్టులను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు విశాఖ, విజయవాడ మెట్రో రైల్ పనులను మూడేళ్లలో సిద్ధం చేయనున్నట్లు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విశాఖపట్టణం, విజయవాడలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఫీజిబుల్టీ రిపోర్టు స్టడీ చేయడానికి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ముందుగా విశాఖపట్టణంలో మెట్రో రైల్ కు టెండర్లు ఇవ్వడం జరిగిందని, నేడో, రేపో విజయవాడ మెట్రోకు టెండర్లు పిలవటం జరుగుతుందన్నారు.
Andhra Pradesh news
Visakhapatnam Metro
Vijayawada Metro Project
AP Infrastructure
Urban Transport Development
Metro Rail Tender
మూడేళ్లలో విజయవాడ
విశాఖ మెట్రో
Scroll for the next article