News4th Dec 11:43 AMSunil Byrisetty1 min read

విజయవాడలో భవనాలపైకి బుల్డోజర్

విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు లక్ష్మీ రామా కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ

విజయవాడలో భవనాలపైకి బుల్డోజర్
విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు లక్ష్మీ రామా కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ పోలీసు బందోబస్తు నడుమ పొక్లెయిన్లతో తరలివచ్చి 16 ఇళ్లను కూల్చివేశారు. మిగతా ప్లాట్ల యజమానులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే, సాయంత్రానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడంతో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. తమ ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులు సితార సెంటర్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయవాదులు చెప్పినా కూల్చివేతలు కొనసాగించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Andhra Pradesh
Vijayawada News
Bhavanipuram
Joji Nagar
House Demolition
Court Orders
Laxmi Rama Society
Police Deployment
Supreme Court Stay
Protest by Residents
బాధితుల ఆందోళన
బైపాస్ రోడ్ నిరసన
భవనాల ధ్వంసం
స్థానిక ఉద్రిక్తత
Scroll for the next article