News5th Nov 12:18 PMSunil Byrisetty1 min read
విజయవాడ హైవే విస్తరణకు సిద్ధం!
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్- విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిల
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్- విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటర్ల వరకు మొత్తం 229 కి. మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించనున్నారు. అందుకు అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో త్వరలో విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి.