Spiritual11th Oct 11:10 AMSunil Byrisetty1 min read

బాలా త్రిపురసుంద‌రి దేవిగా దుర్గ‌మ్మ

విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా తొలి రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి ఆదివారం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన

బాలా త్రిపురసుంద‌రి దేవిగా దుర్గ‌మ్మ
విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా తొలి రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి ఆదివారం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపురసుంద‌రి దేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.
Scroll for the next article