Spiritual11th Jul 11:51 AMSunil Byrisetty1 min read
భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గగుడి
అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పవిత్ర కృష్ణ నదిలో స్నానమాచరించి ఘాట్ రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. ద
అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పవిత్ర కృష్ణ నదిలో స్నానమాచరించి ఘాట్ రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు తీరిన నేపథ్యంలో వారి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి శుక్రవారం రోజున ఆషాఢ సారె సమర్పణ నిమిత్తం ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంభారములు పెడతారో అంతకంటే శ్రద్దగా, భక్తితో భక్త బృందాలు సామాగ్రితో తరలి వచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుమారు 100 మందికి పైగా సభ్యులు గల బృందాలు విశేషరీతిలో విచ్చేశారు.