Politics24th Aug 11:26 AMSunil Byrisetty1 min read
రాజధానికి మెట్రో అవసరమే లేదా?
అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోని విజయవాడలో మెట్రో రైలు ప్రతిపాదనలు ఊపందుకుంటున్నాయి. ఈ సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోస్టుల ఉద్యమం మొదలెట్టారు. దీంతో తన
అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోని విజయవాడలో మెట్రో రైలు ప్రతిపాదనలు ఊపందుకుంటున్నాయి. ఈ సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోస్టుల ఉద్యమం మొదలెట్టారు. దీంతో తన రాజకీయ పునరాగమనం కోసం అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. అయితే కేశినేని నాని అభిప్రాయం ప్రకారం.. మెట్రోకు అయ్యే వేల కోట్ల నిధులతో నగరంలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర ప్రాథమిక వసతులను బాగు చేయాలి. కొండల మీద నివసిస్తున్న వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే మెట్రోకు తీసుకునే రుణం పెరుగుతుంది తప్ప దాంతో లాభాలు వచ్చి అప్పులు తీరవని చెబుతున్నారు. కానీ మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ , ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చే సాఫ్ట్ లోన్స్ , కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిధులు ప్రత్యేకంగా అర్బన్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కోసమే మంజూరవుతాయి. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి వీలు కాదు. రెండుసార్లు ఎంపీగా పని చేసిన నానికి ఆ విషయం తెలియదా అని టీడీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు. అయితే మెట్రోలో కన్నా సందుగొందుల్లో తిరిగేలా 500 ఈవీ బస్సులు తేవడం మంచిదని నాని చెబుతున్నారు.